నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఇంటి ముందు కుడికిళ్ల గ్రామ తెరాస కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎంపీటీసీ టికెట్ బీఫారమ్ ఇవ్వలేదంటూ ఓ వర్గానికి చెందిన కార్యకర్తలు పెట్రోల్ బాటిల్ పట్టుకుని నిరసన తెలిపారు. ఓ కార్యకర్త ఆవేశంలో పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడు. ఎమ్మెల్యే కలగజేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పారు. తమకు కచ్చితంగా బీఫారమ్ ఇవ్వాల్సిందేనని తెరాస నాయకులు పట్టుబట్టారు.
ఇవీ చూడండి: తెల్లవారుజామున తగలబడిన కారు