నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మన్ననూర్ అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. తమ పశువులు అడవిలో మేత మేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అమ్రాబాద్ నల్లమల అడవిలో ఎన్నో ఏళ్లుగా పశువులను మేపుకుంటూ బతుకుతున్నామని... అధికారులు రోజుకో నిబంధన తీసుకొచ్చి తమను వేధిస్తున్నారని ఆరోపించారు.
గిరిజనుల నిరసనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని అటవీశాఖ అధికారులు, రైతులు, గ్రామస్థులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల భరోసాతో గిరిజనులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందించండి: బాధితులు