నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని తిమ్మ రాశిపల్లి గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. తమ గ్రామాన్ని కొత్తగా ఏర్పడిన కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎలా విలీనం చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న తిమ్మరాశిపల్లిని గ్రామ పంచాయతీలోనే ఉంచాలని కోరుతున్నారు. ప్రాదేశిక పరిషత్తు పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేసి గ్రామాన్ని విలీనం చేయొద్దని మొరపెట్టుకున్నారు. ఒక వేళ అలా చేస్తే ఉపాధి హామీ పనులు కోల్పోయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తదని వాపోయారు .
ఇవీ చూడండి: 'గో సంరక్షణ' పేరుతో మరో మూకదాడి