వన్యప్రాణులకు వేసవి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కవ్వాల్, అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యాలతో పాటు.. కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం అభయారణ్యాల్లో జంతువుల సంఖ్య ఎక్కువగా ఉంది. పెద్దపులులు, చిరుతపులులు, జింకలు, మనుబోతులు, అడవిపందులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. అటవీ ప్రాంతాల్లోని చెరువులు, వాగులు, కుంటలు, వాగులు ఎండిపోయాయి. దీంతో దప్పిక తీర్చుకునేందుకు అటవీశాఖ ఏర్పాటుచేసిన సాసర్‌పిట్లు, సోలార్ పంపులపై ఆధారపడాల్సి వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో ఎద్దడి మరింత తీవ్రం కానుంది.
నీటి సమస్య పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా 7,400 వాటర్‌గ్రిడ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అటవీశాఖ మూడు వేలే ఏర్పాటు చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో కృత్రిమ నీటి పిట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో వేటగాళ్లతో ముప్పు కూడా అధికంగా ఉంటుందని.. అడవిలో సహజ నీటి వనరులపై దృష్టి పెట్టాలని వన్యప్రాణి నిపుణుడు ఇమ్రాన్ సిద్ధిఖి సూచించారు. వాగుల్లో చెలిమలు తీయడం వంటి చర్యలు చేపట్టాలన్నారు.
ఇదీ చదవండి: మళ్లీ కరోనా కలవరం.. పెరుగుతోన్న రోజువారీ బాధితులు