నెల రోజుల ప్రణాళిక అమలులో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామాన్ని పరిసర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ రాములు అన్నారు. మార్చాల గ్రామ ప్రజల ఐక్యత ఎంతో గొప్పగా ఉందంటూ కొనియాడారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన అటల్ టింకరింగ్ ప్రయోగశాలను వారు ప్రారంభించారు. చుట్టు పక్కల గ్రామాలతో పోలిస్తే అధిక సంఖ్యలో విద్యార్థులున్న మార్చాల ప్రభుత్వ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే అటల్ టింకరింగ్ ప్రయోగశాల నెలకొల్పేందుకు ఎన్నికైందని ఎంపీ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలులో ఈ గ్రామం ఎంతో ముందుందని స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కొనియాడారు. ఇదే ఒరవడిని ఇతర గ్రామాల ప్రజలు పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: సైబర్ మోసాల్లో కిలేడి... స్కూళ్ల ఫొటోలే అస్త్రం...