ETV Bharat / state

'శ్రీశైలం ఘటన బాధిత కుటుంబాలకు అదనపు ఆర్థిక సాయం'

author img

By

Published : Sep 5, 2020, 8:07 PM IST

శ్రీశైలం జల విద్యుత్​ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్​ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్​ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు. శనివారం విద్యుత్ సౌధలో సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన జెన్​ కో బోర్డు సమావేశం జరిగింది.

'శ్రీశైలం ఘటన బాధిత కుటుంబాలకు అదనపు ఆర్థిక సాయం'
'శ్రీశైలం ఘటన బాధిత కుటుంబాలకు అదనపు ఆర్థిక సాయం'

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు. ప్రమాదంలో మరణించిన డీఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున ఆర్థిక సహాయం అందుతుందన్నారు. మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం విద్యుత్ సౌధలో సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన జెన్​ కో బోర్డు సమావేశం జరిగింది. శ్రీశైలం ప్రమాదంపై బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మరణించిన వారికి బోర్డు సభ్యులు సంతాపం తెలిపారు.

ప్లాంటు పునరుద్ధరణ కమిటి నియామకం

ప్రమాదానికి గురైన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అసవరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని సీఎండీ ప్రభాకర్ రావు నియమించారు. జెన్ కో హైడల్, సివిల్ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సీఈలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరు శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని సీఎండీ ప్రభాకరరావు తెలిపారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.