ETV Bharat / state

'ఆర్థిక న్యాయం సరిపోదు... వారి ప్రాణ త్యాగానికి అర్థం ఉండాలి' - శ్రీశైలం ఉద్యోగుల వార్తలు

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి కారణమైన బాధ్యులపై... కఠిన చర్యలు తీసుకోవాలని జెన్‌కో ఉద్యోగులు డిమాండ్ చేశారు. అమరులైన ఉద్యోగుల కుటుంబాలకు సరైన న్యాయం చేయడంతోపాటు.. ఇప్పుడున్న ఉద్యోగులకు భద్రతపై భరోసా కల్పించాలన్నారు. ప్లాంటు పునరుద్ధరణకు కలిసికట్టుగా శ్రమిస్తామని పునరుద్ఘాటించారు. విద్యుత్ ఉద్యోగుల ఐకాస అధ్వర్యంలో జరిగిన అమరుల సంతాపసభలో వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు ప్లాంట్‌ను సందర్శించిన జెన్‌కో అంతర్గత కమిటీ... ప్రమాద తీరుపై ఆరా తీసింది.

srisailam-employees-demands-for-justice-in-fire-accident
'ఆర్థిక న్యాయం సరిపోదు... వారి ప్రాణ త్యాగానికి అర్థం ఉండాలి'
author img

By

Published : Aug 26, 2020, 1:52 PM IST

శ్రీశైలం ఎడమగట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద తీరు... పలువురు ఉద్యోగులు అసువులు బాయటాన్ని వారి సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈగలపెంటలో విద్యుత్ ఉద్యోగుల ఐకాస అధ్వర్యంలో జరిగిన సంతాపసభలో అమరులకు వారు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తోటివారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న చిన్న ప్రమాదాలు సైతం ఎరగని శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో... భారీ అగ్నిప్రమాదానికి కారణమైన వారు ఎవరైనా... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం, ఇంటికో ఉద్యోగం సహా సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అతనే కారణమా?

జెన్‌కోలో పనిచేసే ఓ ఉన్నతాధికారే ఘటనకు కారణమని.. కమీషన్ల కోసం బ్యాటరీలను హడావుడిగా మార్చినందునే ప్రమాదం జరిగిందని స్థానిక నాయకులు సభలో ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారిని ప్రశ్నించాలని జెన్‌కో అంతర్గత కమిటినీ... వారు సంతాప సభలో కోరారు. రాత్రి వేళ సమయం దాటిపోతున్నా... బ్యాట‌రీల బిగింపు ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌ని వారు నిల‌దీశారు.

విచారణ కొనసాగుతోంది..

మరోవైపు జెన్‌కో నియమించిన అంతర్గత కమిటీ... ప్రమాద ఘటనపై విచారణ కొనసాగిస్తోంది. క‌మిటీ ఛైర్మన్‌గా ఉన్న ఎస్పీడీసీఎల్ ఛైర్మన్ ర‌ఘుమారెడ్డి, స‌భ్యులు వెంక‌టరాజం, జ‌గ‌త్ రెడ్డి, స‌చ్చితానందం... జలవిద్యుత్ కేంద్రంలోని 6 యూనిట్లను నిశితంగా పరిశీలించారు. ఘటనా సమయంలో ప్లాంట్ ట్రిప్ కాక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలపై వారు ఆరా తీశారు. ఇంజినీర్లు, ఉద్యోగులు, బ్యాట‌రీలు బిగించే వాళ్లు మృతిచెందిన ప్రదేశంతోపాటు... 6 ట్రాన్స్ ఫార్మర్లు, 6 జన‌రేట‌ర్లను నిశితంగా ప‌రిశీలించారు.

'ఆర్థిక న్యాయం సరిపోదు... వారి ప్రాణ త్యాగానికి అర్థం ఉండాలి'

భారీ నష్టమే వాటిల్లింది..

కాగా... జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం భారీ నష్టాన్నే మిగిల్చినట్లు తెలుస్తోంది. ప్రమాదధాటికి పెచ్చులూడిన దృశ్యాలు, ప్లాంట్ మొత్తం నల్లని మసితో నిండిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడం, యూనిట్లు పనిచేయకపోవడంతో విద్యుత్ కేంద్రంలోకి భారీగా ఊట‌నీరు వచ్చి చేరుతోంది. 10 హెచ్​పీ మోటార్లతోపాటు, నాలుగు 15 హెచ్​పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బ‌య‌ట‌కు ఎత్తిపోస్తుండగా... మ‌రో 80 హెచ్​పీ మోటారును సైతం ఏర్పాటు చేస్తామ‌ని జెన్‌కో క‌మిటీ వెల్లడించింది. ఈ నీరు తొల‌గిస్తేనే ప్లాంట్ల పున‌రుద్ధరణ వేగంగా సాగే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: బాలుడి మృతదేహం లభ్యం... నిందితుడు అరెస్ట్​... అంతలోనే తల్లి మాయం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.