ETV Bharat / state

రామగిరిలో ఘనంగా సీతారాముల కల్యాణం.. హాజరైన ప్రజాప్రతినిధులు - నాగర్​ కర్నూల్ జిల్లాలో సీతారాముల కల్యాణం

శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘశుద్ధ త్రయోదశి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా రామగిరి గ్రామంలో వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు.

seetharamula kalyanam in ramagiri in nagar kurnool dist
రామగిరిలో ఘనంగా సీతారాముల కల్యాణం.. హాజరైన ప్రజాప్రతినిధులు
author img

By

Published : Feb 25, 2021, 6:58 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామపంచాయతీ పరిధిలోని రామగిరి గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి రోజున ఆలయ నిర్వాహకులు పూజలు చేశారు. ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూలు ఎంపీ పొతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు.

మండలంలోని గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను తిలకించారు. రామగిరి రహదారుల మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక నిధులు తీసుకొస్తామని ఎంపీ, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి.. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం భక్తులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాలయ్య, వైస్ ఛైర్మన్ విజయ్ గౌడ్, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : యాదాద్రి పాతగుట్టలో కన్నులపండువగా వార్షిక బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.