శతాధిక గ్రంథకర్త, సాహిత్య కళానిధి డా. కపిలవాయి లింగమూర్తి లాంటి మహానుబావులు జీవించిన కాలంలో తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. నాగర్కర్నూర్లో రాష్ట్ర సాహిత్య అకాడమీ, నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య సమాలోచన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కవులు కళాకారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తనవంతు సాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్దారెడ్డి పాల్గొన్నారు.
ఇవీచూడండి: తెలుగు భాషే మా సర్వస్వం