ETV Bharat / state

కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత... రేవంత్ రెడ్డికి గాయం - MP Revanth Reddy Latest News

కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తతలో రేవంత్​రెడ్డి కాలుకు గాయమైంది. ఉప్పునుంతల నుంచి కొల్లాపూర్‌ వరకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు తెలకపల్లి వద్ద అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డ రేవంత్‌రెడ్డి కారులో నుంచి దిగకుండా గంట పాటు రోడ్డుపైనే ఉన్నారు. ఈ సమయంలో ఘర్షణ జరిగింది.

Rewanth Reddy was injured in the leg in Kalvakurthi
కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తతలో రేవంత్ రెడ్డికి గాయం
author img

By

Published : Oct 17, 2020, 2:39 PM IST

Updated : Oct 17, 2020, 5:35 PM IST

నాగర్‌ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌ నేతల కల్వకుర్తి ఎత్తిపోతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఉప్పునుంతల నుంచి కొల్లాపూర్‌ వరకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు తెలకపల్లి వద్ద అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డ రేవంత్‌రెడ్డి కారులో నుంచి దిగకుండా గంట పాటు రోడ్డుపైనే ఉన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు అక్కడికి చేరుకుని రేవంత్‌ సహా మిగతా నేతలను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ వద్దకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ నాగర్‌ కర్నూలు-అచ్చంపేట రహదారిపై బైఠాయించారు.

రాకపోకలకు అంతరాయం కలగడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రేవంత్‌రెడ్డికి కాలికి స్వల్ప గాయమైంది. రేవంత్‌, మల్లు రవి, సంపత్‌కుమార్‌ను అరెస్టు చేసి ఉప్పునుంతల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

కాలుపై గాయం చూపిస్తున్న ఎంపీ రేవంత్​రెడ్డి

రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం పోలీసులతో కొట్టించిందని గాయాలను చూపించారు. కేఎల్‌ఐ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మండిపడ్డారు. ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఎం, కేంద్ర జలశక్తి ఛైర్మన్‌పై రేవంత్‌ ఆరోపణలు చేశారు. ముగ్గురిపై కోర్టులో దావా వేయనున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కేఎల్‌ఐకి సమీపంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారని తెలిపారు. నిపుణులు వారించినా ఉద్దేశపూర్వకంగానే నిర్మిస్తున్నారని అన్నారు. గతంలో నిపుణుల కమిటీలు రాసిన లేఖలు, నివేదికలను మీడియాకు చూపించారు.

Last Updated : Oct 17, 2020, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.