నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు తండాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్దకొత్తపల్లి మండలాల్లోని పలు తండాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. రూ. 6 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
అక్రమంగా సారా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా చట్టవ్యతిరేకంగా నాటు సారా తయారు చేసినా.. అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లాపూర్ మద్యపాన నిషేధ సీఐ ఏడుకండలు హెచ్చరించారు.
ఇవీ చూడండి: శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం