నాగర్క ర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు గ్రామం సమీపంలో మదయ చెరువు పూర్తిగా నిండింది. దీంతో అలుగు పోస్తూ... కల్వకుర్తి-తెలకపల్లి ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం వద్ద తాత్కాలిక ఏర్పాటు చేసిన రహదారి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. నీటి ఉద్ధృతి పెరిగి... ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని... పరిసర గ్రామాల ప్రజలు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు కల్వర్టు దగ్గరకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. మండలంలోని రఘుపతిపేట, సుద్దకల్, పంజుగుల, ముకురాల రైతుల వరి, పత్తి పంటలు నీట మునిగాయి.
ఇదీ చూడండి:- మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రశాంత్ భూషణ్