ETV Bharat / state

స్కూళ్లకు పాకిన ర్యాగింగ్.. జూనియర్స్‌ను చితకబాదిన సీనియర్స్ - Raging in Gurukulam

Raging in achhampet Gurukulam ర్యాగింగ్... అంటే కళాశాలల్లో జరగడం మనం విన్నాం. ఇప్పుడు ఈ విష సంస్కృతి స్కూళ్లకు కూడా పాకిందని తాజా ఘటన చూస్తే అర్థం అవుతుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట గురుకులంలో జూనియర్స్‌ను సీనియర్స్‌ చితకబాదారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Seniors
Seniors
author img

By

Published : Mar 6, 2023, 8:54 PM IST

Raging in achhampet Gurukulam విద్యాసంస్థల్లో సోదరభావంతో మెలగాల్సిన సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల మధ్య ర్యాగింగ్‌ భూతం బయటకు వస్తోంది. ఈ విష సంస్కృతి విద్యార్థుల మధ్య చిచ్చుపెడుతోంది. జూనియర్లను వేధించాలన్న సీనియర్ల పైశాచిక ఆనందం... విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది. అంతే కాదు... వారి ప్రాణాలు హరిస్తోంది. పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతుంది.

కళాశాల నిర్వాహకులు, యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరితో.. విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయి. ఇటీవల వరంగల్‌ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో సీనియర్‌ వేధింపులకు బలైపోయిన మెడికో పీజీ విద్యార్థిని ప్రీతి ఘటన మరవక ముందే.. మరిన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా... ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.

అయితే తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేటలో ఓ గురుకులంలో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేగుతోంది. ఇన్ని రోజులు కళశాలలకు అంకితమైన ర్యాగింగ్.. ఇప్పుడు స్కూళ్లకు కూడా పాకినట్లు అర్థం అవుతోంది. సీనియర్ విద్యార్థులు... జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తూ రెచ్చిపోయారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే... నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలోని విద్యార్థులను... కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రాత్రి వేళ చితకబాదారు.

సీనియర్లు చెప్పిన పనిని జూనియర్లు చేయడం లేదని సాకుతో 6, 7, 8 తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులను గదిలో నిర్బంధించి చితకబాదారు. ఇంటర్ చదువుతున్నామని... తాము చెప్పినట్లు వినాలని విద్యార్థులు ఆదేశించారు. దీంతో జూనియర్ విద్యార్థులు తమ గోడును తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులానికి వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు.

మరోపక్క సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై మండిపడ్డారు. బాధితులపై చర్యలు చేపట్టాలని ఆందోళన చేపట్టారు. బాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు.

ర్యాగింగ్‌ నిరోధించేందుకు 1997లో ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ... ఈ ఘటనలు జరుగుతున్నాయి. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా... పెడచెవిన పెడుతున్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుశిక్ష, జరిమానాతోపాటు కళాశాల నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటారు. అయినా ఈ ర్యాగింగ్ భూతం కళాశాలలను కాకుండా.. స్కూళ్లను కూడా వదలడం లేదు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.