నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని అంజనగిరి వద్ద... పాలమూరు రంగారెడ్డి జలాశయం పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు పరిహారం చెల్లించాలంటూ... అక్కడే కూర్చొని ఆందోళన చేపట్టారు. జలాశయానికి నల్లమట్టి తీసుకొస్తున్న టిప్పర్లను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. కట్ట పనులు పూర్తి అయితే తమను ఎవరు పట్టించుకోరని ఆవేదన వ్యక్తంచేశారు.
దాదాపు 6 గంటల పాటు పనులను అడ్డుకొని ఆందోళన చేశారు. పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ప్రాజెక్టు అధికారులతో వాగ్వావాదానికి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిహారం చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని నిర్వాసితులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Colonel santosh babu: సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్