Priyanka Gandhi Telangana Tour Cancelled Today : రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం(Congress Election Campaign Telangana) చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆ వ్యూహాల్లో భాగంగానే నేడు(మంగళవారం), బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.
అయితే తాజాగా ప్రియాంక తెలంగాణ పర్యటన రద్దైంది. అనివార్య కారణాలతో ప్రియాంక పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ తెలిపాయి. ప్రియాంక బదులు ఆ సభల్లో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఒకరోజు ముందే తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్.. ఇవాళ, రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సభల్లో 6 గ్యారెంటీలను జనంలోకి తీసుకువెళ్లడంతో పాటు.. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పర్యటనకు శ్రీకారం చుట్టారు. అగ్రనేత సభలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Priyanka Gandhi Fires on BRS and BJP : 'బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోదీ చేతిలో ఉంది'
Congress Kollapur Meeting Today : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా గతంలో రెండుసార్లు సభలు ఏర్పాటు చేసినా.. అనివార్య కారణాలతో అవి వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో కొల్లాపూర్‌లో జరిగే భారీ బహిరంగసభకు ప్రియాంక బదులు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. పాలమూరు ప్రజాభేరి సభ కోసం భారీ జన సమీకరణ చేస్తున్నారు.
Rahul Gandhi Visit to Palamuru : ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను తరలించడానికి ఏర్పాటు చేశారు. రాహుల్ వెంట పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ముఖ్య నేతలందరూ హాజరుకానున్నారు. నవంబర్ 1వ తేదీన ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్ గాంధీ బస్సుయాత్ర(Telangana Congress Bus Yatra)లో భాగంగా ఆయన కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగే కూడలి సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బస్సు యాత్ర ద్వారా జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ జరిగే కూడలి సమావేశంలో పాల్గొని షాద్ నగర్ పట్టణానికి చేరుకోనున్నారు. పట్టణంలో పాదయాత్ర అనంతరం కూడలి సమావేశంలో మాట్లాడనున్నారు. రాహుల్ యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.