నాగర్‌కర్నూల్ జిల్లా కోడెరులో అకాల వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. 10రోజుల కిందట మార్కెట్‌కు తీసుకువచ్చిన వరిధాన్యం తూకం వేయకపోవటంతో అక్కడే నిలిచిపోయింది. ఎండనకా, వాననకా నిత్యం ధాన్యం కాపలా ఉన్నామని వాపోయారు. తీరా లారీలు రావడం లేదని అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో అకాల వర్షానికి ధాన్యం తడసిపోవడంతో... తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం బస్తాల చుట్టూ వాననీరు చేరటంతో... రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేసి... ఇక్కడి నుంచి తరిలించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు