నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో డ్రోన్ కెమెరాల సాయంతో కాలనీవాసుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు డీఎస్పీ గిరిబాబు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నుంచి రావడం, కాలనీవాసులతో ముచ్చట్లు పెట్టడం, ఇతర కార్యక్రమాలు చేయవద్దని సూచించారు.
కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే వ్యక్తిగత దూరం తప్పనిసరిగా పాటించాలని, లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరకుల కోసం ఒక్కరు మాత్రమే బయటకు రావాలని డీఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఒకటికి రెండుసార్లు కొవిడ్-19 నిర్ధరణ