సబ్సిడీ వడ్ల కోసం వెళ్లిన రైతులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కోడేర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం వద్ద వడ్ల కోసం క్యూలైన్లో తోపులాట చోటుచేసుకుంది. దీనిపై రైతులు పోలీసులను ప్రశ్నించారు. ఆగ్రహించిన పోలీసులు లాఠీ చార్జీకి దిగారు. రైతులను పరుగులు పెట్టించి చితకబాదారు. తన కొడుకుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి తీవ్రంగా గాయపరచారని మహిళా రైతు అనసూయ వాపోయారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో పదివేలు దాటిన కరోనా కేసుల సంఖ్య