నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో 12 మందిని అరెస్టు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. స్థావరం నుంచి రూ. 1 లక్ష రూపాయల నగదు, 14 చరవాణులు, 4 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మద్యం తాగే వారికి, అసాంఘీక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'రైతును లారీతో గుద్ది చంపిన ఇసుక మాఫియా'