ETV Bharat / state

కొల్లాపూర్​లో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు - కొల్లాపూర్​లో బోనాలు పండుగను నిర్వహించిన మహిళలు

నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Pochamma bonala festival in kollapur in nagar kurnool district
కొల్లాపూర్​లో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
author img

By

Published : Feb 15, 2021, 10:53 PM IST

పోచమ్మ తల్లి బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో గ్రామ దేవతల ఆలయాల వద్దకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ప్రతిఏటా గ్రామ శివార్లలో వెలిసిన పోచమ్మ తల్లి విగ్రహాలకు ప్రజలు కోళ్లు, కల్లుతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆనవాయితీగా ప్రతి ఏటా స్వామికి మొక్కులు చెల్లిస్తారు. పాడి పంటలతో రైతులు సంతోషంగా రైతు కమిటీ సభ్యులు దేవతలను పూజిస్తారు. ఈ కార్యక్రమంలో పురపాలిక ఛైర్మన్ విజయలక్ష్మి, మార్కెట్ యార్డు ఛైర్మన్ నరేందర్ రెడ్డి, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : వెంచర్ కోసం డబ్బులిచ్చారు... మోసపోయామని ట్యాంక్ ఎక్కారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.