గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వరి దిగుబడి పెరిగిందని నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూలు మండలంలోని గన్యాగులలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
పెద్ద ముదునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఎవరూ అధైర్యపడొద్దని, గ్రామాలకే వచ్చి కొనుగోలు చేసి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలిపారు.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు