ETV Bharat / state

కరోనాతో భార్య మృతి.. భర్త హఠాన్మరణం

కరోనా బారిన పడిన భార్యాభర్తలు.. ఆ మహమ్మారికి బలయ్యారు. మొదటగా భార్య మృతి చెందిగా... ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త హఠాన్మరణం చెందారు. ఈ విషాద ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా అంబడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

old couple died of corona
కరోనాతో వృద్ధ దంపతులు మృతి
author img

By

Published : May 5, 2021, 8:57 AM IST

కరోనాతో చికిత్స పొందుతూ వృద్ధురాలైన భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త హఠాన్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబడిపల్లి గ్రామానికి చెందిన ఎదుల బక్కమ్మ(65) వారం రోజుల క్రితం కొవిడ్​ బారిన పడ్డారు. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో అంబులెన్స్​లో నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

బక్కమ్మ మరణ వార్త విన్న బక్కయ్య(70) జీర్ణించుకోలేక హఠాన్మరణం చెందారు. ఇతనికీ కొవిడ్​ పాజిటివ్ నిర్ధరణ అయింది. దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ 4రోజుల్లో గ్రామంలో నలుగురు కరోనాతో మృతి చెందారు. గత పది రోజులుగా అక్కడ స్వచ్ఛంద లాక్​డౌన్ పాటిస్తున్నారు.

ఇదీ చదవండి: స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకుంటున్న గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.