నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం రాయలగండి కస్తూర్భా గురుకుల విద్యాలయంలో మూడేళ్ల కిందట ఇంటర్మీడియట్ ప్రారంభమైంది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు అవకాశం కల్పించారు. కానీ అధ్యాపకుల నియామకం జరగలేదు. తెలుగు, ఆంగ్లం, గణిత, వృక్ష, జీవ, రసాయన, భౌతిక శాస్త్రాలకు పీజీసీఆర్టీ అధ్యాపకులను నియమించాల్సి ఉంది. గత విద్యాసంవత్సరంలో లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ తరగతులు, అతిథి అధ్యాపకులతో ఎలాగోలా నెట్టుకొచ్చారు.
మూడు నెలలుగా ఎవరూ లేరు..
మూడు నెలలుగా ప్రత్యక్ష తరగుతులు కొనసాగుతున్నా.. అధ్యాపకులు మాత్రం రాలేదు. అతిథి అధ్యాపకులతో బోధన చేసేందుకు.. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పీజీసీఆర్టీలనే నియమించాలని చెప్పినా భర్తీ చేయలేదు. పదోతరగతి వరకూ బోధించే సబ్జెక్టు ఉపాధ్యాయులతోనే వీలు కుదిరిన సమయంలో... ఇంటర్ విద్యార్థులకు పాఠాలు చెప్పించారు. దీంతో సిలబస్ పూర్తి కాలేదు. ప్రాక్టికల్స్ జరగలేదు. ఎట్టకేలకు బుధవారం(ఫిబ్రవరి 23) పీజీసీఆర్టీలను నియమిస్తూ విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ.. పరీక్షలకు నెలరోజులే గడువు ఉంది. ఈ నెల రోజులైనా పూర్తిగా తరగతులు జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఆగమేఘాల మీద నియామక ఉత్వర్తులు..
ఇంటర్ విద్యార్దులు ఉత్తీర్ణత సాధించేలా... ప్రాథమికంగా సబ్జెక్టులు బోధించే ప్రయత్నం చేశామని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఉమాదేవి తెలిపారు. పీజీసీఆర్టీల నియాకమం పూర్తైందని, విధుల్లో చేరనున్నట్లు తెలిసిందని ఆమె వివరించారు. పీజీసీఆర్టీ నియామక ఉత్వర్తుల జారీ విషయంలో ఇన్నాళ్లూ తాత్సారం చేసిన జిల్లా అధికార యంత్రాంగం బుధవారం(ఫిబ్రవరి 23) ఆగమేఘాల మీద ప్రక్రియను పూర్తి చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ సహా కోడేరు, పదర, బల్మూరు, బిజినేపల్లి, పెంట్లవెల్లి, తెలకపల్లి కస్తూర్భా గురుకుల కళాశాల్లో 17మంది పీజీసీఆర్టీ అధ్యాపకులను నియమిస్తూ.... తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: