తెలంగాణకే ప్రత్యేకమైన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పొడజాతి పశువుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించనుంది. బలిష్టంగా ఉండి ఎంత కష్టమైన పనులనైనా అవలీలగా చేస్తూ.. వ్యవసాయంలో రైతులకు చేదోడుగా ఉండే ఈ పొడజాతికి గతేడాది రాష్ట్ర పశువుగా గుర్తింపు లభించింది. రాష్ట్ర జీవవైవిధ్య మండలి, వాసన్, కోనేరు సంస్థల కృషి ఫలితంగా జాతీయ జీవవైవిధ్య మండలి ఈ జాతికున్న ప్రత్యేక లక్షణాలను గుర్తించింది
నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వీటికి జాతీయ గుర్తింపు గురించి ప్రకటించనున్నట్లు తమకు సమాచారం అందిందని అమ్రాబాద్ పొడ లక్ష్మి గోవు సంఘం అధ్యక్షుడు హనుమంతు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు.. నేడు ఉత్తర్వులు!