ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో నరహంతకుడి అరెస్ట్ - విచారణలో విస్తుపోయే నిజాలు - నాగర్‌కర్నూల్ పోలీసుల అరెస్ట్‌లో తాంత్రికుడు

Nagarkurnool Police Arrested Tantrik For killed 11 people : క్షుద్రపూజలు చేసి గుప్తనిధులు వెలికి తీస్తానని నమ్మిస్తాడు. అందుకోసం డబ్బుంటే డబ్బు లేదంటే ప్లాట్లు, భూములు తన పేరున రాయించుకుంటాడు. కాజేసిన సొమ్ము, ఆస్తులు బాధితులు తిరిగివ్వమని అడిగితే, వారిని పూజల పేరుతో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. తీర్థమని చెప్పి విషరసాయనాలతో కూడిన పాలిచ్చి అపస్మారక స్థితికి చేర్చుతాడు. ఆ తర్వాత యాసిడ్ పోసి లేదంటే, బండరాళ్లు మోపి హతమార్చుతాడు. అలా 2020 నుంచి 11 మంది అమాయకులను కిరాతకంగా హత్య చేసిన, నిందితున్ని నాగర్ కర్నూల్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి అదృశ్యం కేసు దర్యాప్తులో భాగంగా నిందితున్ని విచారించగా, మిగిలిన 10 హత్యల బండారం బైటపడింది.

Nagarkurnool Police Arrested Serial Killer
Nagarkurnool Police Arrested Tantrik For killed 11 people
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 3:13 PM IST

Updated : Dec 12, 2023, 3:37 PM IST

Nagarkurnool Police Arrested Tantrik For killed 11 people : 2020 నుంచి ఇప్పటి వరకూ వరుసగా 11మంది అమాయకులను గుప్త నిధుల పేరిట కిరాతకంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ అలియాస్ సత్యం యాదవ్​ను నాగర్​కర్నూల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన 8కేసుల్లో 11మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ మేరకు నిందితుని హత్యోదంతాలను జోగులాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహన్ మీడియాకు వెల్లడించారు.

DIG Chouhan Revealed Serial Killer Crime : నాగర్​కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు క్షుద్రపూజలు చేసి గుప్తనిధులు వెలికి తీస్తానని నమ్మించి అమాయకుల నుంచి తొలత డబ్బులు కాజేస్తాడు. డబ్బులు లేవంటే ఇండ్లస్థలాలు(House sites), భూములు తన పేరుమీద రాయించుకుంటాడు. ఆ తర్వాత పూజల పేరుతో వారిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. తీర్ధం పేరుతో గుర్తుతెలియని రసాయనాలు కలిపిన విషాన్నివారిచేత తాగిస్తాడు.

నాగర్​కర్నూల్​లో నరహంతకుడు - మాయమాటలు చెప్పి 11 మందిని హతం

బాధితులు అపస్మారక స్థితికి వెళ్లాక వారిపై యాసిడ్ పోసి లేదంటే బండరాళ్లు మోపి హత్య చేస్తాడు. అలా 2020 నుంచి ఇప్పటి వరకూ మహిళలు సహా 11మందిని హతమార్చినట్లు డీఐజీ వెల్లడించారు. నిందితుని నుంచి హత్యకు గురైన వ్యక్తులకు చెందిన 5 సెల్ ఫోన్లు, నిందితుడు వినియోగించిన 8 సెల్ ఫోన్లు,10 సిమ్ కార్డులు, ఓ కారు, విష రసాయానాలున్న డబ్బాలు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లను(Electric Detonators) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Man Killed 11 Members in Nagarkurnool : 2020 నుంచి హత్యలు చేస్తున్న నిందితుడు చివరకు ఓ వ్యక్తి అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసుల చేతికి చిక్కాడు. హైదరాబాద్ లంగర్ హౌజ్​కు చెందిన గోవుల లక్ష్మి భర్త వెంకటేష్, నాగర్ కర్నూల్​లో సత్యంయాదవ్ కలిసి వస్తానని చెప్పి, 5రోజులుగా తిరిగి రాలేదు. దీంతో ఆమె నేరుగా నాగర్ కర్నూల్​కు వచ్చి సత్యనారాయణను నిలదీయగా సరైన సమాధానం ఇవ్వలేదు. అనుమానం వచ్చిన ఆమె నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్ లో వెంకటేశ్ కనిపించడం లేదంటూ కేసు నమోదుచేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు సత్యనాయరణ ప్రవర్తనపై అనుమాన పడ్డారు. నిందితుడు చాలాకాలంగా స్థిరాస్థి వ్యాపారం, నాటువైద్యంతో గుప్త నిధులవేట సాగించేవాడు.

జగిత్యాలలో బాలుడి అపహరణకు యత్నం - నిందితుడికి దేహశుద్ధి

క్షుద్రపూజలు చేసి గుప్తనిధులను వెలికి తీస్తానని నమ్మించేవాడు. ఆ మాటలు నమ్మిన వెంకటేశ్ గుప్తనిధులు(Hidden Treasures) వెలికి తీసేందుకు సత్యనారాయణను సంప్రదించారు. డబ్బిస్తే చేస్తానని అంగీకరించిన సత్యనారయణ ఒంటరిగా వస్తేనే చేస్తానని వెంకటేశ్​కు షరతు విధించాడు. అందుకు వెంకటేశ్ సహా అతని స్నేహితులు అంగీకరించారు. గుప్తనిధుల్ని కనిపెట్టాలంటే తానిచ్చిన మూలికల్ని చెప్పినచోట ఉంచి రావాలని పలుమార్లు వెంకటేశ్ ను వివిధ ప్రాంతాలకు పంపి కాలం గడిపాడు.

Tantrik Killed 11 People in Nagarkurnool : కొంతకాలం తర్వాత నిధి దక్కాలంటే ముగ్గురు గర్భిణులను బలివ్వాలని సూచించాడు. దీంతో వెంకటేశ్ భయాందోళన గురై, ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. తన బండారం బైట పడుతుందని, ఎలాగైనా అతన్ని చంపాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. మరోచోట నిధులున్నాయని వెంకటేశ్​ను నవంబర్ 3న నాగర్ కర్నూల్​కు రప్పించాడు. నాలుగో తేదీ ఉదయం 4 గంటలకు పరగడుపున తీర్థమని చెప్పి విషపూరిత రసాయనాలు(Toxic Chemicals) జిల్లేడుపాలను వెంకటేశ్ చేత తాగించాడు.

దీంతో వెంకటేశ్ అపస్మారస్థితికి చేరుకున్నాడు. అతన్ని జలాల్​పూర్ శివారుకు తీసుకెళ్లి దుస్తులు విప్పించి యాసిడ్ పోసి హత మార్చి తిరిగి నాగర్ కర్నూల్ చేరుకున్నాడు. భార్య అదృశ్యం కేసు నమోదు చేయడంతో పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా, అంతకుముందు చేసిన 10 హత్యలను బైటపెట్టాడు.

పట్టపగలే ఎంత పనిచేశావయ్యా - బైక్ బ్యాగ్​లో నుంచి డబ్బు కాజేసిన దొంగ

వననర్తి జిల్లా రేవల్లి మండలంలో నలుగురు, నాగర్ కర్నూల్ పీఎస్ పరిధిలో ఇద్దరు, కొల్లాపూర్, కల్వకుర్తి పీఎస్ పరిధిలో ఒక్కొక్కరు, కర్ణాటక రాష్ట్రం బలగనూరు పీఎస్ పరిధిలో ఒకరు, ఆంధ్రప్రదేశ్ అనంతరపురం పెద్దవడుగూరులో ఒకరు, ఇలా వెంకటేశ్ సహా 11 మందిని నిందితుడు హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో(Police Investigation) వెల్లడైంది. రేవల్లి కేసులో బాధితుల నుంచి ఇండ్లస్థలం, అనంతపురం కేసులో మూడున్నర ఎకరాల భూమి, నాగర్ కర్నూల్ కేసులో ఇంటి స్థలం, వెంకటేశ్ హత్య కేసులో రూ.9లక్షల నగదును నిందితుడు కాజేశాడు.

Accused Carefulled without Evidence : మూడున్నరేళ్లుగా కేసులు నమోదవుతున్నా, సరైన ఆధారాలు లేకుండా నిందితుడు జాగ్రత్తపడటంతో పట్టుకోలేక పోయామని డీఐజీ తెలిపారు. ఈ కేసులో హత్యకు గురైన వారి 5 సెల్ ఫోన్లు నిందితుని వద్దే ఉండటంతో సిగ్నళ్ల ఆధారంగా మిగిలిన కేసుల్లోనూ నేరం బైటపడిందని చెప్పారు. ఇవేకాకుండా ఇప్పటి వరకు నమోదైన ఇతర అదృశ్యం, అనుమానాస్పద మృతి కేసుల్లో నిందితునికి ఏమైనా సంబంధాలున్నాయా, తదుపరి విచారణ జరపుతామన్నారు. గుప్తనిధులపైన ఆశతో ఎవరూ మోసపోవద్దని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చౌహన్ సూచించారు. కేసు నమోదైన కొద్దిరోజుల్లోనే హత్యోదంతాలను ఛేదించిన పోలీసు అధికారులు సిబ్బందికి డీఐజీ అభినందలు తెలిపారు.

భూవివాదంలో ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి! సస్పెండ్ చేసిన ఐజీ

మైలార్​ దేవ్​పల్లిలో భారీ అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం

Last Updated : Dec 12, 2023, 3:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.