ETV Bharat / state

ప్రైవేటు ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేసిన కలెక్టర్​ - ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేసిన కలెక్టర్​ శర్మన్​

నాగర్​ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి కలెక్టర్​ శర్మన్​ బియ్యం పంపిణీ చేశారు. పాఠశాలలు పున:ప్రారంభం అయ్యేవరకు ప్రతి నెల సాయం అందిస్తామని కలెక్టర్​ పేర్కొన్నారు.

nagarkurnool collector sarman
private teachers
author img

By

Published : Apr 22, 2021, 7:51 PM IST

ప్రైవేటు ఉపాధ్యాయులకు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని నాగర్​ కర్నూలు జిల్లా కలెక్టర్​ శర్మన్​ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. మొదటి విడతలో భాగంగా 1,258 మందికి నగదు, బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రైవేటు ఉపాధ్యాయుల వివరాలను విద్యాసంస్థల నుంచి తీసుకుని... డీఈవో పరిశీలించిన అనంతరం బియ్యం అందజేస్తున్నట్లు వెల్లడించారు.

పాఠశాలలు పున:ప్రారంభం అయ్యేవరకు ప్రతి నెల సాయం అందిస్తామని కలెక్టర్​ పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు అందిస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు, డీఎస్​వో మోహన్​బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.