ETV Bharat / state

డ్రైవర్​ శాంతయ్య.. పాటలు భలే పాడుతున్నావయ్యా.! - ఆర్టీసీ ఆదాయం పెంపు కోసం డ్రైవర్​ శాంతయ్య పాటలు

కరోనాతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆర్టీసీకి లాభాలు రావడం కోసం తన వంతు కృషి చేస్తున్నారు నాగర్​ కర్నూల్​ జిల్లాకు చెందిన డ్రైవర్​ శాంతయ్య. బస్సులో ఉన్న ప్రయాణికులను తన గాత్రంతో కట్టిపడేస్తున్నారు. కర్తవ్యం పట్ల అతనికున్న అంకితభావాన్ని మనం అభినందించాల్సిందే.

nagar kurnool, driver shanthaiah
నాగర్​ కర్నూల్​, డ్రైవర్​ శాంతయ్య
author img

By

Published : Mar 1, 2021, 9:14 AM IST

ఆర్టీసీకి ఆదాయం రావడానికి నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన డ్రైవర్ శాంతయ్య వినూత్న ప్రయోగం చేశారు. జిల్లా కేంద్రం నుంచి ప్రతి ఆదివారం పెద్దకొత్తపల్లి మండలం మైసమ్మ గుడికి ప్రత్యేక బస్సులు నడుపుతుంటారు. అయితే ఈ ఆదివారం మైసమ్మ గుడికి తన బస్సులో వస్తున్న ప్రయాణికుల కోసం అమ్మవారిపై ప్రత్యేకంగా పాటలు పాడి వారిని అలరించారు.

కరోనాతో కష్టకాలంలో ఉన్న రవాణా సంస్థను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు డ్రైవర్​ పేర్కొన్నారు. సంస్థకు లాభాలు రావడం కోసం ఈ చిన్న ప్రయత్నమని వివరించారు. శాంతయ్య ఈ విధంగా పాటలను ఆలపిస్తుండటంతో సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అతను పాడిన పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ప్రయాణికులను ఆకర్షించేందుకు అమ్మవారిపై పాటలు పాడుతున్న శాంతయ్య

ఇదీ చదవండి: సున్నా జోడించారు.. రాయితీల సంగతి మరిచారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.