నాగర్ కర్నూల్ జిల్లా కోడూరు మండలంలో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ శర్మన్.. ముగ్గురు వీఆర్వోలను సస్పెండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలు, డంపింగ్ యార్డ్, శ్మశానవాటికలు వంటి అభివృద్ధి కార్యక్రమాల పనులను పరిశీలించారు.
మైలారం, మాచుపల్లి, జనంపల్లి గ్రామాల వీఆర్వోలు విధులకు హాజరు కానుందన సస్పెండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శర్మన్ హెచ్చరించారు.
- ఇదీ చూడండి: పబ్జీ.. ఇది ఆటా లేక యమ పాశమా?