ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లపై రెవెన్యూ అధికారులతో నాగర్‌కర్నూల్ జిల్లా పాలనాధికారి ఎల్.శర్మాన్ చౌహాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు పది రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్లు చౌదరి, హనుమంత్‌రెడ్డి, శిక్షణ కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్షలో పాల్గొన్నారు.
ధరణి పోర్టల్‌కు సంబంధించి సమగ్ర సమాచారంపై జిల్లాలోని మీసేవ నిర్వాహకులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవడంపై స్పష్టంగా వివరాలు తెలియజేయాలన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా పాలనాధికారి ఆదేశించారు.