నల్లమలలో నివసించే చెంచులకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషి చేస్తానని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మాన్ చౌహాన్ తెలిపారు. జిల్లాలోని నల్లమల ప్రాంతంలోని అప్పాపూర్, చెంచుపెంటను కలెక్టర్ శర్మాన్ సందర్శించారు. చెంచుల జీవన స్థితిగతులు, ఉపాధి, ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకాలు వారికి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు.
చెంచులు అనుభవిస్తున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 30 మంది రైతులకు బ్యాంకు ఖాతాలు లేవని అలాగే నీటి సమస్య ఉందని తెలిపారు. ఆశా వర్కర్ మాత్రమే వస్తుందని ఏఎన్ఎం రావడంలేదన్నారు. వారి సమస్యలను సానుకూలంగా స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.