నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ ఛైర్ పర్సన్ పద్మావతి, జేసీ శ్రీనివాసరెడ్డితో కలిసి పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు.
రెండో విడత ప్రణాళికలో డంపింగ్ యార్డు నిర్మాణం, హరితహారం, వైకుంఠ నిర్మాణంపై మార్గదర్శకాలు రూపొందించి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం శ్రీపురం రోడ్డు వద్ద రూ. 18 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇదీ చూడండి: జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి