నాగర్‌కర్నూలు జిల్లా మూలం గ్రామానికి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు నిరసనగా నారాయణపేటలో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. తమపై పని భారం పెరిగిందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి కారణంగా ఎంతో మంది ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రజలను చైతన్య పరుస్తున్నారు కానీ... అధికారుల్లో చైతన్యం రావటంలేదని ఆగ్రహం వ్యకం చేశారు.
ఇదీ చూడండి: శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!