ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పరామర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ఆమెపై అధికారులు, రాజకీయనాయకులు ఒత్తిడి చేయడం దారుణమన్నారు.
ఉన్నత విద్య అభ్యసించిన ఆమెపై ఒత్తిడి తేవడం వల్లనే మానసికంగా కుంగిపోయి ఈ చర్యకు పాల్పడిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట యూటీఎఫ్ నాయకులు, తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: రాగల మూడ్రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు