ETV Bharat / state

మార్కెట్​ను సందర్శించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి

author img

By

Published : Apr 4, 2020, 2:57 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లాక్​డౌన్​ను ఎలా నిర్వహిస్తున్నారని పర్యవేక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​ను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు.

MLC Kasireddy visited the nagarkurnool market
మార్కెట్​ను సందర్శించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి

ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను విధిగా పాటించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి మూడు మీటర్ల సామాజిక దూరం పాటించాలని సూచించారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను పరిశీలించారు.

అందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, గంటకోసారి చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. ఇంటి నుంచి బయటికి వచ్చిన వ్యక్తులు తప్పకుండా నోటికి మాస్కులు ధరించాలన్నారు. సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలతోనే వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. డీఎస్పీ గిరిబాబుతో కలిసి పోలీసులకు, పాత్రికేయులకు శానిటైజర్, మాస్కులు, సబ్బులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదులు, ఎస్సై మహేందర్, పుర ఛైర్మన్ సత్యం, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'అడుగు బయట పెట్టకు.. ఆపదలో పడకు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.