నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆవంచలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనం, మైనార్టీ, ముదిరాజ్ల భవనాలను ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే వెంకటేశ్వర ఆలయానికి భూమి పూజ చేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా 15మంది అదనపు ఎస్పీల బదిలీ