తెరాస ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెలను ప్రగతి పథంలోకి నడిపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తాండూరు మండలంలో చేపడుతోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటి రైతులు లాభపడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. రైతులు.. ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని సూచించారు.
ఇదీ చదవండి: Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద... నీటి ఎత్తిపోతలు ప్రారంభం