ETV Bharat / state

Gold donation for Yadadri : యాదాద్రికి ఎమ్మెల్యే భారీ విరాళం - Yadadri temple donations

యాదాద్రి ప్రధాన ఆలయ(yadadri temple gold donation) విమాన గోపురం స్వర్ణ తాపడానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి భారీ విరాళం ఇచ్చారు. కుటుంబసమేతంగా స్వామివారిని శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి... వేదాశీర్వచనం చేశారు.

Gold donation for Yadadri, Marri Janardhan Reddy Gold donation for Yadadri temple
యాదాద్రికి ఎమ్మెల్యే భారీ విరాళం
author img

By

Published : Nov 26, 2021, 3:20 PM IST

Gold donation for Yadadri, Marri Janardhan Reddy Gold donation for Yadadri temple
రెండు కేజీల బంగారం విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే

MLA Marri Janardhan Reddy Gold donation for Yadadri temple: యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి... వేదాశీర్వచనం చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఇదీ చదవండి: Gold Donations for Yadadri: విమాన గోపురానికి రూ. 3 కోట్ల విరాళం.. మంత్రి మల్లారెడ్డికి వ్యాపారుల అందజేత

Yadadri Lakshmi Narasimha Swamy Temple: విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం 125 కిలోల బంగారం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గతంలో​ తెలిపారు. ప్రతీ గ్రామాన్ని ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ముఖ్యమంత్రి తొలి విరాళం కిలో 16 తులాల బంగారం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వీరిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించారు. ఒక్కరోజులోనే సుమారు 22 కిలోల పసిడి విరాళంగా (22kg gold donate) సమకూరింది. ఇదీ చదవండి: Kcr Gold Donation For Yadadri: 'యాదాద్రికి తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారం ఇస్తా'

హెటిరో చైర్మ‌న్ పార్థ సార‌ధి రెడ్డి 5 కిలోల బంగారం

ముఖ్యమంత్రి కేసీఆర్​ చూపిన స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం హెటెరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారాన్ని (5KG Gold donation to Yadadri) విరాళం ప్రకటించారు. త‌న కుటుంబం త‌ర‌పున ఈ విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదీ చదవండి: Minister Mallareddy : డబ్బులు నెత్తిన పెట్టుకొని యాదాద్రికి మల్లారెడ్డి

తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భారీ విరాళం

సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరఫున కిలో బంగారం ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్‌, ఎమ్మెల్సీలు కె.నవీన్‌ కుమార్‌, శంభీపూర్‌ రాజు, ఏపీలోని కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి: yadadri temple works: మహాకుంభ సంప్రోక్షణకు ఇంకా 140 రోజులే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.