నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఆరో విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే జైపల్ యాదవ్ మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతు వేదిక భవనానికి ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
అనంతరం రైతు వేదిక భవనానికి ఉచితంగా భూమిని అందించిన భగవాన్‌రెడ్డిని ఎమ్మెల్యే సన్మానించారు. ప్రతి గ్రామంలో రైతు వేదిక నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని జైపాల్ యాదవ్ కోరారు. రైతు సంక్షేమంలో మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణ ముందుందని... అన్ని ప్రాంతాల్లోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.