ETV Bharat / state

ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేసిన బీరం హర్షవర్ధన్​రెడ్డి - ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో రంజాన్​ పండుగను కొవిడ్​ నిబంధనల నడుమ జరుపుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే బీరం దుస్తుల పంపిణీ
ఎమ్మెల్యే బీరం దుస్తుల పంపిణీ
author img

By

Published : May 7, 2021, 5:37 PM IST

రంజాన్ పండుగను పురస్కరించుకుని నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో ముస్లిం సోదరులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి హాజరై.. సుమారు వెయ్యి మంది నిరుపేద ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో మైనార్టీలకు తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముస్లిం సోదరుల పిల్లలకు ఉన్నత చదువులు, గురుకుల పాఠశాలతో పాటు విదేశీ చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న దృష్ట్యా ముస్లింలు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఆర్డీవో హనుమ నాయక్, ఎంపీపీ భోజ నాయక్, పురపాలిక ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, మార్కెట్ యార్డు ఛైర్మన్ నరేందర్ రెడ్డి, కో-ఆప్షన్​ సభ్యులు, తెరాస నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.