నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. నియెజకవర్గంలోని 98 మంది బాధితులకు రూ.48,60,000 విలువైన చెక్కులు అందించారు. సీఎం సహాయ నిధి... పేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నియెజకవర్గంలోని బాధితులెవ్వరు అధైర్యపడొద్దని... ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు వైద్యం పొందలేని వారికి సర్కారు సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: 'ఆ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో ఇప్పటిదాకా 6 వేల మంది దరఖాస్తు'