నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ పద్మావతమ్మలు శంకుస్థాపన చేశారు. రూ.2.5 కోట్లతో కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు గదులు, రామాలయంలో భక్తుల సౌకర్యార్థం నూతన భవనానికి భూమి పూజ చేశారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు.
పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భాగ్యమ్మ, ఎంపీపీపీ సుధారాణి, పురపాలక ఛైర్ పర్సన్ విజయ లక్ష్మీ, వైస్ ఛైర్మన్ మహమూదా బేగం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'