ETV Bharat / state

కేబుల్​ వర్కర్ల నిర్లక్ష్యం.. మిషన్​ భగీరథ పైపు పగిలి నీరు వృథా - telangana news

నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో ప్రధాన రహదారిపై మిషన్​ భగీరథ పైపు పగిలి మంచి నీరు వృథాగా పోయింది. దీంతో రహదారి చెరువును తలపించేలా మారిపోయింది. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

mission bhageerath pipe damaged
మిషన్​ భగీరథ పైపు పగిలి నీరు వృథా
author img

By

Published : Mar 13, 2021, 4:23 PM IST

ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైపు పగిలి వృథాగా మంచినీరు పోవడంతో చెరువును తలపించిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో చోటుచేసుకుంది. పూలే విగ్రహం సమీపంలో కేబుల్​ వర్కర్లు భూగర్భ పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

కేబుల్ పనులు చేసేటప్పుడు మున్సిపాలిటీ సిబ్బందిని వెంట పెట్టుకొని వారి సలహాల మేరకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా చేయడంతోనే పైపు పగలిందని మిషన్ భగీరథ అధికారులు గుర్తించారు. ఈ మేరకు పోలీసు స్టేషన్​లో పిర్యాదు చేశారు. పోలీసులు కేబుల్ వర్క్ వాహనాన్ని పీఎస్​కు తరలించారు.

కేబుల్​ వర్కర్ల నిర్లక్ష్యం.. మిషన్​ భగీరథ పైపు పగిలి నీరు వృథా

ఇదీ చదవండి: కార్యకర్త కుమార్తె పుట్టిరోజుకు కేటీఆర్​ విష్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.