నాగర్‌కర్నూల్ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 1,2,3 దశల పనులను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పరిశీలించారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్, ఏలూరు వద్ద జరుగుతున్న పనుల పురోగతిని ఆరాతీశారు. సొరంగం, ఆనకట్ట, రిజర్వాయర్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, ప్రభుత్వ చీఫ్ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, అబ్రహం, రామ్మోహన్ రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, నారాయణరెడ్డి, కలెక్టర్ శర్మాన్ చౌహన్ పాల్గొన్నారు.
ఇవీచూడండి: పాలమూరు-రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సశ్యశ్యామలం: శ్రీనివాస్ గౌడ్