ETV Bharat / state

'రైతులకు మేలు జరుగుతుందంటే చట్టాలను స్వాగతిస్తాం' - కల్వకుర్తి పరిధిలో రైతు వేదికల ప్రారంభోత్సవం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలో రైతు వేదిక భవనాలు, పలు అభివృద్ధి పనులను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు వేదికలు రైతన్నలను సంఘటితం చేసేందుకు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు తెరాస అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

minister niranjan reddy inaugurated raithu vedikalu in nagarkurnool
'రైతులకు మేలు జరుగుతుంది అంటే చట్టాలను స్వాగతిస్తాం'
author img

By

Published : Dec 30, 2020, 6:47 AM IST

నియంత్రిత సాగుకు రైతులు సంపూర్ణ మద్దతు తెలిపారని.. కానీ విపక్షాలు దీనిని రాజకీయం చేశాయని మంత్రి నిరంజన్​రెడ్డి విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ గ్రామంలో రైతు వేదిక భవనం, కల్వకుర్తి పురపాలిక పరిధిలోని పలు అభివృద్ధి పనులు, వెల్దండ మండలం కొట్ర గ్రామంలో రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రైతు వేదికలు సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచన అని.. ఈ వేదికలు రైతులను సంఘటితం చేసేందుకు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు.

రైతుబంధు సాయం అందిస్తున్నాం

కనీస మద్దతు ధర రైతులకు దక్కాలనేదే కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు కింద రూ. 7,515 కోట్లను 61 లక్షల మంది ఖాతాలో జమ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు తెరాస అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రభుత్వానికి వేరే మార్గం లేదు

రైతులకు మేలు జరుగుతుంది అంటే కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలను స్వాగతిస్తామని మంత్రి అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం జరుగుతుందని వివిధ రూపాలలో కేంద్రానికి నిరసన తెలిపినా.. అవే చట్టాలను అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగానికి లోబడి కేంద్ర చట్టాలను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రైతులు- కేంద్రం మధ్య నేడు ఆరోదఫా చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.