ETV Bharat / state

'వారిని బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం' - మంత్రి జగదీశ్ రెడ్డి వార్తలు

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోపల చిక్కుకున్న సిబ్బందిని... సురక్షితంగా బయటకు తీసుకువచ్చే చర్యలు చేపట్టారు.

minister-jagadish-reddy-on-fire-accident-in-srisailam-power-station
'ప్లాంట్ ఆపే ప్రయత్నం చేసే అది సాధ్యం కాలేదు'
author img

By

Published : Aug 21, 2020, 10:14 AM IST

శ్రీశైలం ఎడమగట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో యూనిట్‌ మొత్తాన్ని పొగలు కమ్మేయగా... 9 మంది సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా రప్పించేందుకు సహాయక సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్నివిద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

పొగ దట్టంగా అలుముకుంది..

జల విద్యుత్‌ కేంద్రంలో చిక్కుకున్న సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలోని యూనిట్‌ 1లో మంటలు చెలరేగినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో జల విద్యుత్‌ కేంద్రంలో జెన్‌కో సిబ్బంది ఉన్నారని.. వారిలో 10 మంది బయటకు రాగా, మరో 9 మంది లోపలే చిక్కుకుపోయారని వెల్లడించారు. విద్యుత్ కేంద్రంలో పొగ దట్టంగా అలుముకోవడంతో లోపల ఉన్న సిబ్బంది శ్వాస ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి: శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న 9 మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.