ETV Bharat / state

నాగర్​ కర్నూల్​లో ఘనంగా మిలాద్​ ఉన్​ నబీ వేడుకలు - మిలాద్​ ఉన్​ నబీ సందర్భంగా నాగర్​ కర్నూల్​లో ర్యాలీ

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో మిలాద్​ ఉన్​ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారి నుంచి ర్యాలీ చేపట్టారు. కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలని ముస్లింలు ప్రార్థనలు చేశారు.

milad un nabi celebrations in nagarkurnool district
నాగర్​ కర్నూల్​లో ఘనంగా మిలాద్​ ఉన్​ నబీ వేడుకలు
author img

By

Published : Oct 30, 2020, 6:56 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం రాత్రి మసీదుల్లో జాగరణతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు.

ఈ రోజు ఉదయం జామా మసీదు ప్రాంగణంలో అన్నదానం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారి నుంచి బస్టాండ్, వక్ఫ్​ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మసీదు కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా వక్ఫ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గురు పేద ముస్లిం జంటలకు వివాహాలు జరిపించారు. ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.