ETV Bharat / state

సరిలేరు మీకెవ్వరూ.. పౌరోహిత్యంలో రాణిస్తున్న మంజులాదేవి - Bairapur village latest news

Manjula Devi Excelling Priestly Profession: పౌరోహిత్యాన్ని వృత్తిగా చేపట్టేది దాదాపుగా పురుషులే. మహిళలు ఆ వృత్తిని ఎంచుకోవడం చాలా అరుదు. కానీ కుటుంబ పరిస్ధితుల దృష్ట్యా పౌరోహిత్యాన్నివృత్తిగా ఎంచుకుని 26ఏళ్లుగా ఆ రంగంలో రాణిస్తున్నారామె. సత్యనారాయణ వ్రతంతో శుభకార్యాలు చేయడం ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత అన్నిరకాల శుభకార్యాలు చేయడం మొదలు పెట్టారు. మొదట్లో ఆడవాళ్లు పౌరహిత్యం చేయడమేంటని ప్రశ్నించిన వాళ్లే.. ఆ కార్యాలు చేసే విధానం చూసి ఆమెను పురోహితురాలిగా పిలిపించుకోవడం మొదలుపెట్టారు. తాను నివాసముండే గ్రామంతో పాటు.. చుట్టుపక్కల గ్రామాల్లోనూ మంచిపేరుతెచ్చుకున్న నాగర్​కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన మంజులాదేవిపై ప్రత్యేక కథనం.

MANJU
MANJU
author img

By

Published : Mar 9, 2023, 4:35 PM IST

సరిలేరు మీకెవ్వరూ.. పౌరోహిత్యంలో రాణిస్తున్న మంజులాదేవి

Manjula Devi Excelling Priestly Profession: శుభకార్యాలు, గుడిలో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, హోమాలు ఇలాంటివి ఏవి జరిగినా పురోహితుడు తప్పనిసరి. పురోహితులంటే అంతా పురుషులే. మహిళలు అరుదుగా పౌరోహిత్యం చేస్తున్నాఆదరించే వాళ్లు తక్కువ. అలాంటిది 26 ఏళ్లుగా పౌరోహిత్యంలో కొనసాగుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు నాగర్​కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బైరాపూర్​కు చెందిన మంజులాదేవి.

మంజుల స్వస్థలం ఊర్కొండ మండలం రేవల్లి. తొమ్మిదో తరగతి వరకూ కల్వకుర్తిలోనే విద్యాభ్యాసం చేశారు. 1972లో కర్ణాటక రాష్టానికి చెందిన కృష్ణమూర్తితో వివాహం జరిగింది. వెల్దండ మండలం రాచూరులో కాపురం పెట్టారు. భర్తకు తెలుగు తెలియకపోవడం, పౌరోహిత్యం రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ నేపథ్యంలో అమె గ్రామంలో.. ప్రైవేటు ఉపాధ్యాయురాలిగా, విద్యావాలంటీరుగా, టైలర్​గా పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవీ ఆమెకు అచ్చిరాలేదు.

వివిధ పూజాది కార్యక్రమాల్ని ఎలా చేయాలో నేర్చుకున్నారు: ఆ సమయంలో తనకున్న అనుభవంతో మంజులాదేవి.. సర్పంచ్ ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. దానిని చూసి మెచ్చిన గ్రామస్తులు శుభకార్యాల కోసం ఆమె దగ్గరికే రావడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పంచాంగం, మూహుర్త నిర్ణయం సహా పెళ్లిళ్లు, వ్రతాలు, హోమాలు, గృహప్రవేశాలు లాంటి పూజాది కార్యక్రమాల్ని ఎలా చేయాలో నేర్చుకున్నారు మంజులాదేవి. పెద్దకుమారుడు బైరాపూర్ లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు. ఆయన కుటుంబంతో సహా హైదరాబాద్​కు మారడంతో గుడికి పూజారి లేకుండా పోయారు. బైరాపూర్ దేవాలయంలోనూ కొద్దిరోజులు పూజారిగా కొనసాగారు.

బైరాపూర్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు.. ఆమెను పురోహితురాలిగా శుభకార్యాలకు పిలిచేవారు. అలా గ్రామస్తుల ఆదరణ సంపాదించారు. వచ్చిన సంపాదనతో కూతురి వివాహం కూడా చేశారు. మహిళగా పౌరోహిత్యం చేస్తామంటే ఆమెను వ్యతిరేకించిన వాళ్లూ లేకపోలేదు. అయినా మంజులాదేవి వెనక్కి తగ్గలేదు. కాశీలోనూ మహిళలు పౌరహిత్యం చేస్తుండగా తాను చేస్తే తప్పేంటని ముందుకు సాగారు. ఎలాంటి శుభకార్యమైనా శాస్త్రబద్ధంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు.

అందరి ఇళ్లలోనూ అమ్మగా కలిసిపోయారు: అందరి ఇళ్లలోనూ అమ్మగా కలిసిపోయారు. పూజాది కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చే మంజులాదేవి.. డబ్బుల విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టేవారు కాదు. ఆర్ధిక స్తోమతను బట్టి.. ఎంతిస్తే అంత తీసుకుని ఆశీర్వదించే వారు మంజులాదేవి. అందుకే బైరాపూర్​తో విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. 2017లో భర్త మరణించడంతో ప్రస్తుతం..పెళ్లిలాంటి కొన్నిరకాల శుభకార్యాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పౌరోహిత్యంలోకి వచ్చిన ఆమె.. 26ఏళ్లుగా ఆ రంగంలోనే కొనసాగుతున్నారు. ఎవరు ఎన్నిరకాలుగా ప్రశ్నించినా తాను చేసే వృత్తికి సరైన న్యాయం చేయాలన్నది మంజులాదేవి భావన. అందుకే రెండు దశాబ్దాలుగా జనం ఆదరణ చూరగొన్నారు.

"సర్పంచ్ ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించాను. ఆ తర్వాత వివాహాలు, వ్రతాలు, హోమాలు, గృహప్రవేశాలు ఎలా చేయాలో నేర్చుకున్నాను. పౌరోహిత్యం చేస్తానంటే నన్ను మొదట వ్యతిరేకించారు. ఆ తర్వాతే వారే నన్ను నమ్మి శుభకార్యాలకు పిలిచారు. 2017లో నా భర్త మరణించారు. పౌరోహిత్యంలోకి వచ్చి దాదాపు 26 సంవత్సరాలు అవుతుంది." - మంజులాదేవి, మహిళా పురోహితురాలు

ఇవీ చదవండి: చదువుల తల్లి విజయలక్ష్మి విజయగాథ మీకు తెలుసా..?

భద్రాద్రిలో మొదలైన కల్యాణ వేడుకలు.. ఇక్కడ తలంబ్రాలు ఎరుపుగా ఉండడానికి కారణం తెలుసా?

భారీగా బ్యాంక్ ఉద్యోగాలు.. జీతం రూ.5లక్షలు.. అప్లైకి మరో 5 రోజులే ఛాన్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.