ETV Bharat / state

మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బ.. పావు శాతం దిగుబడి కూడా లేనట్టే..!

author img

By

Published : Mar 29, 2022, 7:55 PM IST

Mango Crop Loss: చెట్టు నిండా కాయలతో నిగనిగలాడాల్సిన తోటలు... పూత, కాత లేకుండా రైతుల్ని వెక్కిరిస్తున్నాయి. లక్షలు వెచ్చించి పురుగు మందులు చల్లినా ఫలితం లేకుండా పోయింది. పావు శాతం దిగుబడి కూడా చేతికందని దుస్థితి నెలకొంది. రెండేళ్లుగా కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టాల నుంచి తేరుకోకముందే.. తామర పురుగు నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మామిడి రైతులను నిండాముంచింది.

mango farmers loss this year also with Tamara Pest to crop
mango farmers loss this year also with Tamara Pest to crop

మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బ.. పావు శాతం దిగుబడి కూడా లేనట్టే..!

Mango Crop Loss: నాగర్​కర్నూల్​ జిల్లాలోని కొల్లాపూర్​లో సాగుచేసే బేనిషాన్ రకం మామిడికి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. బహిరంగ మార్కెట్​లోనూ కొల్లాపూర్ మామిడికి మంచి డిమాండ్ ఉంది. అయినా.. మూడేళ్లుగా కొల్లాపూర్ మామిడి రైతులు తీవ్రనష్టాలు ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా మామిడి దిగుబడి బాగా వచ్చినా.. కొవిడ్ ఆంక్షల కారణంగా డిమాండ్ పడిపోయింది. ధర అంతంత మాత్రంగానే పలికింది. రెండేళ్లుగా నష్టాలను చవిచూసిన రైతులు.. ఈ ఏడాదైనా కలిసి వస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ.. మామిడిని ఆశించిన తామర పురుగు కన్నీళ్లనే మిగిల్చింది.

నిలవని పూత... పిందే..: సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో మామిడి పంట పూత పడుతుంది. మార్చి నాటికి కాయలు కాసి.. ఏప్రిల్, మే మాసాల్లో కోతకు వస్తాయి. ఈసారి మాత్రం పూత ఆలస్యమైంది. జనవరి వరకూ పూతే లేదు. ఆ తర్వాత చెట్టు నిండా పూత వచ్చినా.. అది నిలవలేదు. తెల్ల, నల్లని తామర పురుగులు ఆశించడంతో 90 శాతం పూత రాలిపోయింది. పూత పిందెగా మారినా.. వాటి పరిస్థితి కూడా అంతే. కొల్లాపూర్​లోని ఏ మామిడి తోటను చూసినా ఇదే దుస్థితి.

డిమాండ్​ ఉన్నా.. దిగుబడి లేదు..: కొల్లాపూర్ డివిజన్​లో 9,900 మంది రైతులు 22 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తుండగా.. అందులో 15 వేల ఎకరాల వరకు మంచి దిగుబడినిచ్చే తోటలున్నాయి. అయితే 50 శాతానికి పైగా కౌలు రైతులే తోటల్ని లీజుకు తీసుకుని సాగు చేస్తుంటారు. జనవరిలోనే కొల్లాపూర్ తోటల్లో తామర పురుగును గుర్తించారు. వాటి నివారణ కోసం ఎకరాకు 10 వేల వరకూ ఖర్చుచేసి పురుగు మందులు పిచికారి చేశారు. అయినా.. ఫలితం మాత్రం కనిపించలేదు. పురుగు నియంత్రణలోకి రాకపోవడం వల్ల రైతులు కూడా ఏమీ చేయలేక అలాగే వదిలేశారు. చూడటానికి చెట్లన్ని పచ్చగా నిగనిగలాడుతున్నా.. దిగుబడి పావుశాతం కూడా లేదు. పురుగు ఉద్ధృతిని నివారించేందుకు.. ఈసారి పెట్టుబడులు సైతం ఎక్కువే పెట్టారు. రెండేళ్లుగా కరోనా కారణంగా దెబ్బతిన్న రైతులు.. ఈ ఏడాది కౌలు డబ్బులు కూడా రావని ఆవేదన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్​లో మామిడి ధర టన్నుకు లక్ష పలుకుతున్నా.. అమ్మడానికి పంటే లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతులు ఆవేదన..: "జనవరిలోనే ఈ పురుగును గుర్తించాం. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన అన్ని మందులు పిచికారి చేశాం. కానీ.. లాభం లేదు. పూత ఆలస్యంగా వచ్చింది. ఆ వచ్చింది కూడా నిలవలేదు. వేప చెట్లు మాడిపోయినట్టు.. మామిడి పూత కూడా మాడిపోయి రాలిపోయింది. ఇక అక్కడో ఇక్కడో మిగిలిన పూత.. పిందె పట్టినా.. అవి కూడా రాలిపోయాయి. ఇప్పుడు మొత్తం కలిసి సుమారు 10 శాతం దిగుబడి కూడా కష్టమే.."- మామిడి రైతు, కొల్లాపూర్​..

"నేను చిన్నప్పటి నుంచి ఇంత నష్టం ఎప్పుడూ చూడలేదు. తామర పురుగని అధికారులు చెబుతున్నారు. చాలా మందులు కొట్టినం. కొట్టినప్పుడల్లా.. ఎకరానికి 10 వేల ఖర్చు వస్తుంది. ఇంతకు మునుపు ఎకరానికి లక్ష లాభం వచ్చేది.. ఇప్పుడు తోట మొత్తం మీద కూడా లక్ష వచ్చేట్టు లేదు. పెట్టుబడి అప్పే మీది పడెటట్టుంది. అధికారులకే అర్థం కాని తెగులొచ్చి మమ్మల్ని నిండా ముంచింది."- మామిడి రైతు, కొల్లాపూర్​..

కొల్లాపూర్​లో మాత్రమే కాదు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఐదేళ్ల వయసున్న మామిడి తోటల పరిస్థితి దాదాపుగా ఇదే. తామర పురుగు కారణంగా దిగుబడులు సగానికి సగం పడిపోనున్నాయి. ఫలితంగా.. ఈ సీజన్​లో మామిడి పండ్లు మరింత ప్రియం కానున్నాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.