నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మద్యం సేవించి రహదారిపై వీరంగం చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి రక్త నమూనాలు సేకరించి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్తులో తూలుతూ పోలీసులు, పాత్రికేయులపై దాడికి పాల్పడ్డారు. ముగ్గురిలో ఒక వ్యక్తి హైదరాబాద్లోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా.. ఇద్దరు మహిళలు జీహెచ్ఎంసీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి: రెచ్చిపోయిన మరో ఉన్మాది... యువతిపై కత్తితో దాడి