కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త జిల్లాల కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ను మాజీ ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ముట్టడించారు. పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ హయాంలో 8 శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 3.5 శాతం పడిపోయిందని తెలిపారు. తహసీల్దార్ విజయ రెడ్డి హత్యకు కారకులైన వారు ఎంతటి వారినైనా శిక్షించి తీరాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: వెలుగులోకి నయా దందా... ఇదో కొత్త పెళ్లిగోల